అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

నూతన సర్పంచ్ కందగట్ల రాంచందర్ (అన్నా సేట్)స్పష్టం

గ్రామంలో అంబరాన్నంటిన సర్పంచ్ ప్రమాణ స్వీకారం

ఎంపి,ఎమ్మెల్యే ల సహకా రంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

రైల్వే స్టేషన్ పురుద్దరణకు,కోతులు నివారణకు కృషిసర్పంచ్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 23 : (నవీన్ కుమార్) గ్రామ అభివృద్దే లక్ష్యంగా కులాలకు,మతాలకు,పార్టీల కు అతీతంగా తాను పని చేస్తానని, తనని గెలిపించిన ప్రజల కోసం సేవ చేస్తానని నూతన సర్పంచ్ కందగట్ల రాంచందర్(అన్నా సేట్) స్పష్టం చేశారు. ఎడపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కందగట్ల రామచందర్,ఉప సర్పంచ్ గా మచ్కూరీ గంగాధర్,వార్డు సభ్యులు ఒక పండగ వాతావరణంలో అట్టహసంగా ఎంపిడివో శంకర్ నాయక్ చే ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు సర్పంచ్ రాంచందర్,పంచాయతీ కార్యాలయంలోని తన చాంబర్ లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్త పద్ధతిలో దైవ సాక్షిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ కందగట్ల రాంచంద ర్ బాధ్యతలు స్వీకరించారు.ముందుగా తన తల్లి దండ్రులకు పాదాభివందనలు చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి సర్పంచ్ రాంచందర్ మాట్లాడుతూ.. రాంచందర్ అంటేనో, బిజెపి అంటేనో మైనార్టీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తాను అన్నివర్గాల ప్రజలను కలుపుకొని స్థానిక సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ముఖ్యంగా పాలకవర్గ సభ్యుల సలహాలు,సూచనలు తీసుకొని అభివృద్ధి పనులు చేప డుతానని అన్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ,శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మాటలు ఉన్నాయో అంత్యోదయ పథకం చివరి వరకు ప్రతి పథకం చేరాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. అయొక్క మాటకు, స్ఫూర్తికి కట్టుబడి ఉండి,ప్రతి సంక్షేమ పథకాన్ని చివరి వరకు తీసుకెళ్తానని,ఇందుకు తాను కట్టుబడి ఉన్నాని అన్నారు. అంత్యోదయ పథకం అంటే మొట్టమొదటి వారికీ భోజనం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో చివరి వారికి కూడా అలాంటి భోజనం ఉండాలని అంత్యోద య పథకాన్ని దీన్ దయాల్ ఉపాధ్యాయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పథకాన్ని చేపట్టడం జరిగింది అని పేర్కొన్నారు. ఈ పథకాన్ని మాపాలక వర్గం,అందరి అండదండాలతో కొనసాగిస్తాననిఅన్నారు.స్థానిక సమస్యల కోసం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, అలాగే ప్రభుత్వ ముఖ్య సలహాదా రులు, బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ల సమన్వయంతో ఎడపల్లి గ్రామానికి అధిక నిధు లు తీసుకొచ్చి ఎడపల్లి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాన ని,సమస్యలు లేని ఆదర్శ గ్రామంగా,మండల,జిల్లా,రాష్ట్ర, దేశంలోనే గుర్తింపు తీసుకొస్తానని అయనస్పష్టం చేశారు.గ్రామంలో ప్రధానమైనటువంటి సమస్య మార్కెట్ యార్డ్ సమస్యను ఎంపి, ఎమ్మెల్యే లను కలిసి ఈ సమస్యను వారి ముందుంచి పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని సర్పంచ్ కందగట్ల రాంచం దర్ స్పష్టంచేశారు. ముఖ్యంగా గ్రామంలో కోతుల బెడదా ఉందని,తాను గెలిచిన తర్వాత కోతుల ను అరి కట్టెందుకు సూర్యాటలో ఉన్న కోతులు పట్టేవా రితో మాట్లాడడం జరుగుతుందని,వారితో త్వరగా మాట్లాడి కోతులు పట్టే విషయంలో తాను ముందుకు వెళ్తానని హామీ ఇచ్చారు.గ్రామంలో ప్రధానమైనటువం టి రెండు జడ్పి పాఠశాలలు ఉన్నాయని,ఇందులో తెలుగు,ఉర్దూ పాఠశాలలు ఉన్నాయని అన్నారు. అయితే తెలుగు చాలా మీడియం పాఠశాలను పిఎంసి పథకం లో చేర్చాలని ఎంపి ని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది అన్నారు. పిఎంసి పథకంలో పాఠశాలను చేర్చినట్లయితే దాని ద్వారా పాఠశాలకు ఎక్కువ నిధు లు వస్తాయని అన్నారు.పాఠశాలలో బాలికలకు మూత్రశాలలు,మరుగు దొడ్లు,అదనపు తరగతి గదు లు లేవు అని,పిఎంసి పథకం ద్వారా టాయిలెట్లు, మరుగు దొడ్లు, అదనపు గదులు నిర్మాణం,పాఠశాలలో గదులు మరమ్మత్తు పనులు చేపట్టవచ్చని అన్నారు.ఈ సందర్బంగా పాఠశాలను పిఎంసి పథకంలో చేర్చాలని ఎంపి అరవింద్ ని కోరినట్లు చెప్పారు.ఎంపి అరవింద్ తో మంచి సంబంధం ఉందని,మీరు చెబితే మాట కాద నడు అని, గ్రామస్తులు చెప్పడం జరిగింది అని, అలాగే సిపిఐ ఎంఎల్ రైతు సంఘం నాయకుడు గుమ్ముల గంగాధర్ కూడా కోరడం జరిగింది అని అన్నారు. ఎడపల్లి, రెంజల్ మండలాల ప్రజలకు ఎంతో సౌలభ్యం గా, చౌక చార్జిలతో దూరప్రాంతాలకు వెళ్లేందుకు గాను ఎడపల్లి గ్రామంలో రైల్వే స్టేషన్ పునఃనిర్మాణానికి ఎంపి అరవింద్ తో మాట్లాడి తన శాయశక్తుల కృషి చేస్తానని రాంచందర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు,గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు,ప్రజాప్రతి నిధులు ఎంపిడిఓ శంకర్,గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment