మహిళల ఈద్ మిలన్ కార్యక్రమం ఘన విజయవంతం

మత సామరస్యానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి మహిళాల పిలుపు
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఏప్రిల్ 02 : నిజామాబాద్‌లో జమాత్-ఏ-ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్, ఖలీల్‌వాడిలో బుధవారం నిర్వహించిన మహిళల ఈద్ మిలన్ కార్యక్రమం ఘనంగా, విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ మతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యత, సౌహార్దతకు నిదర్శనంగా నిలిచారు.ఈ కార్యక్రమానికి అస్మా జరీన్ (రాష్ట్ర అడ్వైజరీ కౌన్సిల్ సభ్యురాలు, జమాత్-ఏ-ఇస్లామీ హింద్ తెలంగాణ & ఉపాధ్యక్షురాలు AITA) అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, ఇటువంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.ముఖ్య అతిథులుగా శ్రీమతి ఉమారాణి (మేయర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్), శ్రీమతి కె. కృష్ణవేణి (జిల్లా మైనారిటీస్ వెల్ఫేర్ అధికారి), శ్రీమతి డా. కవిత రెడ్డి (చైర్‌పర్సన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, తెలంగాణ) పాల్గొన్నారు. వారు ఈద్ పండుగ ప్రాముఖ్యత, మహిళల బాధ్యతలు, మత సామరస్యంపై ప్రసంగించారు.గౌరవ అతిథులుగా శ్రీమతి సల్మా తహ్సీన్ (డిప్యూటీ మేయర్), శ్రీమతి డా. రామా దేవి (హెడ్, గైనకాలజీ విభాగం, NMC), శ్రీమతి కె. భారతి రెడ్డి (ప్రిన్సిపాల్, గవర్నమెంట్ మహిళా కళాశాల), శ్రీమతి ప్రొఫెసర్ డా. ఖైసర్ అంజుమ్ (బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం, టీయూ నిజామాబాద్), శ్రీమతి ఫీబా క్రిస్టినా, శ్రీమతి ఇందిరా రాణి (ప్రిన్సిపల్స్, TMREIS, నిజామాబాద్) హ్యూమన్ రైట్స్  శ్రీమతి రషీదా, పాల్గొని మత సామరస్యంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.కార్యక్రమంలో వక్తలు రమజాన్, రోజా, ఈద్ పండుగల ప్రాముఖ్యతను వివరించి, ఇస్లాం సందేశమైన శాంతి, ప్రేమ, సౌహార్దతను ప్రోత్సహించారు. వివిధ మతాలకు చెందిన మహిళలు పరస్పరం ఒకరి పండుగలను మరొకరు గౌరవిస్తూ కలిసి జీవించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జమాత్-ఏ-ఇస్లామీ హింద్ ప్రతినిధులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment