మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ.
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఏప్రిల్ 05 : ఆదివారం నిజామాబాద్ నగరంలో గల రైల్వే కమాన్ చౌరస్తాలో ఉన్న పీడిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 19వ జయంతి సందర్భంగా మాదిగ జేఏసి. అన్నబాహు సాటే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశ రాజకీయాలలో ఓటమెరుగని ఏకైక నాయకుడు బాబు జగ్జీవన్ రామ్. ఆయన జీవితకాలం మొత్తం దేశం కోసం అణగారిన వర్గాల కోసమే పని చేశారు. అందుకే యువత బాబు జగ్జీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలు కొనసాగించాలని తెలియజేస్తున్నాం.ఈ కార్యక్రమంలో అన్న బహుసాటే సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ గైక్వాడ్. నగర అధ్యక్షులు సాయి కాంబ్లే. మాదిగ జేఏసీ జిల్లా నాయకులు విజయ్ మాదిగ. శంకర్. గణేష్. గాయక్వాడ్ తదితరులు పాల్గొన్నారు.









