వైద్యుల సలహాలతో ఆటిజం వ్యాధిని నియంత్రించవచ్చు

ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంలో ప్రముఖ వైద్యులు

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఏప్రిల్ 02 : సకాలంలో వైద్యుల సలహా మేరకు ఆటిజం వ్యాధిని నియంత్రించవచ్చని ప్రముఖ వైద్య నిపుణులు సూచించారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ను పురస్కరించుకొని స్నేహ సొసైటీలో కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతీ నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్, ఇందూర్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ నిజామాబాద్ వైద్యులు,డాక్టర్ సత్యకుమార్ స్వామి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ దీపక్ రాథోడ్ పీడియాట్రిషియన్స్ ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇన్నమూరి రవితేజ, డాక్టర్ రాజేందర్ సూరినీడు తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటిజం వ్యాధిని 1980 సంవత్సరంలో గుర్తించడం జరిగిందని తెలిపారు. అనంతరం 2022లో 50 మంది ఆటిజం బారిన పడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఆటిజంఅనేది మానసిక వ్యాధి కాదని తెలిపారు.. ఈ ఆటిజం అనేది 15 నుండి 18 నెలల వ్యవధిలో గుర్తించినట్లయితే పిల్లల నడవడికను గుర్తించి వైద్యుల సలహాలు సూచనల మేరకు పిల్లలతో కలిసిపోవడం ద్వారా ఈ ఆటిజం ను అధిగమించవచ్చన్నారు.ఆటిజంను గుర్తించడానికి పలు లక్షణాలను తెలియపరిచారు. ఈ ఆటిజంకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో మాత్రమే ప్రస్తుతం ఇవ్వడం జరుగుతుందన్నారు.నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.అనంతరం ప్రతి 50 మంది చిన్నారుల్లో ఒకరు ఈ ఆటిజం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ ఆటిజం సంబంధించి పూర్తిస్థాయిలో జీవితాంతం ఉండదని సరైన సమయంలో సరైన విధంగా వైద్యుల సలహాలు సూచనల మేరకు నడుచుకున్నప్పుడు పిల్లలతో సఖ్యతగా ప్రేమగా వారు చేసే తప్పిదాన్ని వారికి స్పష్టంగా ప్రేమతో తెలియజేయడంతో వారిలో మార్పు తీసుకురావడం సులభ తరమవుతుందన్నారు. అయితే ఈ ఆటిజం అనేది జన్యుపరంగా గాని మనం చుట్టూ నివాసం ఉండే పరిసరాలను బట్టి కూడా రావచ్చన్నారు.. ముందుగా ఈ ఆటిజం బారిన పడిన పిల్లల లక్షణాలు ఒకరితో ఒకరు కలిసి ఉండకపోవడం ఒంటరిగా ఉండడం అలాగే మౌనంగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నారు. అయితే ఈ ఆటిజం తల్లి యొక్క మానసిక ఆరోగ్యం మరియు తీసుకునే ఆహారం మరియు తల్లి శారీరక ఆరోగ్యము చెడు అలవాట్లు పొగ త్రాగడం ఆల్కహాల్ తీసుకోవడం మరియు షుగర్ వ్యాధి గ్రస్తుల సంక్రమించే ఆస్కారము ఉంటుందన్నారు. అలాగేప్రకృతి సంబంధించి ఫోను మరియు తనలో తాముమాట్లాడుకోవడం ఆడిన ఆటలు పదేపదే ఆడడం ఇతర పిల్లలతో కలవకపోవడం తనలోకంలో తానే ఉండిపోవడం,మానసిక ఎదుగుదల లేకపోవడం, ఎదిరించి మాట్లాడడం కొత్త మనుషులతో కాంటాక్ట్ లో ఉండకపోవడం ఇలా రకరకాల లక్షణాలు ఉంటాయి.ఈ లక్షణాలు తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ద్వారా వారిభవిష్యత్తు బాగుంటుందన్నారు.. అలాగే హైపర్ టెన్షన్ ఉన్న పిల్లల్లో ఎక్కువగా షుగర్ కు సంబంధించి చాక్లెట్లు తినిపించడం వల్ల హైపర్ యాక్టివ్ అనేది పెరిగే ఆస్కారం ఉంటుందన్నారు.. వీలైనంతవరకు హైపర్ ఆక్టివ్ ఉన్న పిల్లలుచక్కెర ఎక్కువగా ఉన్న తినుబండారాలను పెట్టకూడదని సూచించారు. ఆటిజం మరియు మానసిక దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక పద్ధతిలో నేర్పించడం జరుగుతుందని స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి సిద్ధయ్య తెలిపారు..విద్యార్థిని విద్యార్థులకు వారి ఆరోగ్య స్థితిగతులు మరియు వారి ఆరోగ్య స్థితిగతులను వారు అనుకరించే పద్ధతిని గమనిస్తూ వారికి ఏ విధంగా చెబితే వారిలో మార్పు తీసుకురావచ్చు అనేదిగుర్తించి విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు.అలాగే వారికి ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకు అందరూ ఒకే చోట ఉంచడం మరియు వారిలో మరింత ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందించే దిశగా చదువుతోపాటు విద్య మరియు యోగా ఆటలు ఆడించడం పాటలు నృత్యాలు లాంటివి చేయించడం జరుగుతుందన్నారు… ఇలా వారికి చేయించడం ద్వారా వారిలో చదువుతోపాటు వారిలో దాగివున్న కలలు బయటకు తీసుకురావడం జరుగుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ విద్యార్థుల తల్లిదండ్రులు, మరియు అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, కార్యవర్గ సభ్యులు రమణ రెడ్డి,డాక్టర్ శ్రీకాంత్,మరియు దాతలు ముప్పాళ్ళ సత్యనారాయణ కమలాపూర్, మేడం రామ్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి స్నేహ సొసైటీ సిబ్బంది మానసిక దివ్యాంగులు, అంద విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment