ఈనెల 25 నా ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు.

నిజామాబాద్ జిల్లాలో జీవన్ రెడ్డి స్టైలే వేరు–బీఆర్ఎస్ బలోపేతానికి ప్రత్యర్ధుల ఊహకందని ఎత్తుగడలు

వేరే పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి జాయినింగ్స్ లో ఆయన వ్యూహాలు నెక్స్ట్ లెవల్–ఒక్క ఆర్మూర్ నుంచే పోటీ చేసిన ఏడుగురు నేతలను బీ ఆర్ఎస్ లో చేర్పించిన ట్రాక్ రికార్డ్ 

జిల్లాలో బీఆర్ఎస్ కు పూర్వవైభవం తెచ్చేందుకు జీవన్ రెడ్డి అడుగులు–కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్ వైపు చూసేలా ఆపరేషన్ ఆకర్ష్ కు పదును

ఇప్పటికే పలు పార్టీల నేతలతో సంప్రదింపులు–25న బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్న బీజేపీ నేత విజయభారతి

త్వరలో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి మరిన్ని చేరికలు.

నిజామాబాద్ జై భారత్ ఆగస్ట్ 23 : తెలంగాణ మలి విడత ఉద్యమానికి తొలి అడుగుపడిన రోజు నుంచి స్వరాష్ట్రంలో పదేండ్ల అధికారయోగం వరకు నిజామాబాద్ జిల్లాలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం నిస్తేజం ఆవరించిన బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభమ య్యాయి. ప్రత్యర్ధి పార్టీల అబద్ధాల మాటలకు బీటలు బారిన నిజామాబాద్ జిల్లా గులాబీ కోటకు మరమత్తులు చేయడంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి దృష్టి సారించారు. పార్టీ నేతలను సమన్వయం చేయడం, పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపడం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ, కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు రూపుదిద్దు కుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్ధి పార్టీలను నిస్తేజపర్చి బీఆర్ఎస్ లో ఉత్తేజం నింపేలా జీవన్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. నిజానికి నిజామాబాద్ జిల్లాలో రాజకీయంగా జీవన్ రెడ్డి స్టైలే వేరు. బీఆర్ఎస్ బలోపేతానికి ఆయన రచించే ఎత్తుగడలు ప్రత్యర్ధుల ఊహకందని విధంగా ఉంటాయి.వేరే పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి జాయినింగ్స్ లో ఆయన వ్యూహాలు నెక్స్ట్ లెవల్ అని ప్రత్యర్ధులే మెచ్చుకున్న సందర్భాలు కోకొల్లలు.ప్రస్తుతం ఆయన జిల్లా అధ్యక్షుడుగా బీఆర్ఎస్ కు పూర్వవైభవం తెచ్చేందుకు అడుగులు వేస్తున్నారు.కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్ వైపు చూసేలా ఆపరేషన్ ఆకర్ష్ కు ఆయన పదును పెట్టారు. ఇప్పటికే పలు పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఇందులో భాగంగా కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా జీవన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. తొలుత జిల్లాకు చెందిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు విజయభారతి బీఆర్ఎస్ లో చేరేలా చేయడంలో జీవన్ రెడ్డి సఫలీకృతులయ్యారు. సోమవారం తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఆమె ఇప్పటికే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. త్వరలో ఇతర పార్టీల నుంచి బీ ఆర్ఎస్ లోకి మరిన్ని చేరికలు ఉండనున్నా యి. నిజానికి మొదటి నుంచి ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలను బీఆర్ఎస్ లో చేర్పించడంలో జీవన్ రెడ్డికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో ఇతర పార్టీల్లో ఉండి ఉన్నత స్థాయి అధికారపదవులు నిర్వహిస్తూ జిల్లాను ఏలిన కీలక నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరడంలో ప్రధాన భూమిక పోషించిన జీవన్ రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్ దృష్టినాకర్షించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా పనిచేయడమే కాక 2014 ఎన్నికలలో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి తన మీదే పోటీ చేసి ఓడిపోయిన కేఆర్ సురేష్ రెడ్డిని ఆ తరువాత బీఆర్ఎస్ లోకి తీసుకువచ్చిన జీవన్ రెడ్డి పార్టీపై తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. 2014లో ఆర్మూర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా తనపైనే పోటీ చేసి ఓడిపోయిన రాజారామ్ యాదవ్, 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన ఆకుల లలిత, 2019లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నరసింహ నాయుడు,2009–14ఎన్నికలలో ఆర్మూర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ మధుశేఖర్ ఇలా ఒక్క నియోజకవర్గం నుంచే వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ లో చేర్పించి జీవన్ రెడ్డి కేసీఆర్ ప్రశంసలు పొందారు. టీడీపీ రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర వహిస్తూ నిజామాబాద్ జిల్లా నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసిన మండవ వెంకటేశ్వరరావు నందిపేట్ మండలం సాక్షిగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంలో, ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం, జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే సాయన్నలు కూడా బీఆర్ఎస్ లో చేరేలా చేయడంలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన జీవన్ రెడ్డి అప్పటికే పోటీలో ఉన్న అమర్ నాథ్ బాబును తప్పించి మార గంగారెడ్డిని మార్క్ ఫెడ్ చైర్మన్ గా చేయడంలో, దాదన్నగారి విఠల్ రావు నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంలో నిర్వహించిన పాత్ర ప్రముఖమైనది. పార్టీలో చేరిన డాక్టర్ మధుశేఖర్ కు ప్రభుత్వ పరంగా ఛైర్మన్ పదవి ఇప్పించడంలో కూడా ఆయన సఫలీకృతులయ్యారు. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా జీవన్ రెడ్డి తనదైన స్టైల్ లో ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులను బీఆర్ఎస్ లో చేర్పించడంపై దృష్టి సారించారు. , బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు విజయభారతిని బీ ఆర్ఎస్ లోకి తీసుకురావడంలో విజయం సాధించి మరోసారి తన మార్క్ రాజకీయానికి శ్రీకారం చుట్టారు. త్వరలో జిల్లాంతా తిరిగి బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలనే సంకల్పంతో ఉన్న జీవన్ రెడ్డి ప్రధాన పార్టీల నేతలు బీ ఆర్ఎస్ లో చేరే విధంగా వ్యూహరచన చేసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు జిల్లా నేతలను జీవన్ రెడ్డి సంప్రదించినట్లు సమాచారం. అధికారం లేనప్పుడు పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకొని మరీ పని చేసిన తమకు పార్టీ అధికారంలోకి వచ్చినా ఎలాంటి గుర్తింపు లేదని పలువురు కాంగ్రెస్ నాయకుల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతోంది. అలాగే ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పెల్లుబికుతున్న ఆగ్రహ జ్వాలలు, కేసీఆర్ పాలనే అద్భుతంగా ఉందని వ్యక్తమవుతున్న అభిప్రాయాలు చూసి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ముందే బీ ఆర్ఎస్ లో చేరాలనే ఆలోచనతో ఉన్నారు. అలాగే నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తదితరుల ఒంటెద్దు పోకడలతో జిల్లాలో పలువురు బీజేపీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. అలాంటి వారందరికీ గాలం వేసి బీ ఆర్ఎస్ లో చేరేవిధంగా జీవన్ రెడ్డి చాపకింద నీరులా ఇప్పటికే పని ప్రారంభించారు. బీ ఆర్ఎస్ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉండనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment