జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 05 : నిజామాబాద్ నగరంలో బైపాస్ రోడ్డులో నేడు తెల్లవారుజామున కారు అజాగ్రత్తగా నడిపి, పల్టీ కొట్టిన సంఘటన స్థలాన్ని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్. పోలీసుల వివరాల ప్రకారం,కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రాంతానికి చెందినటువంటి చింతల శ్రీనివాస్ ఇటుకల బట్టి వ్యాపారస్తుల వద్ద పని చేస్తున్నారు.కార్మికులు నాందేడ్ కు ఫ్యామిలీ విషయం మాట్లాడడం కోసం వెళ్లి తిరిగి ప్రయాణం అవుతున్న సందర్భంలో నేడు తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డు ప్రాంతంలో గల మారుతి ఈకో గల వాహనమును కారు డ్రైవర్ అతివేగముగా అజాగ్రత్తగా నడపడం వలన కెనాల్ పై నుంచి క్రిందపడి మూడు పల్టీలు కొట్టినది.ఇట్టి ప్రమాదంలో ఇద్దరు మరణించడం జరిగింది. నలుగురు తీవ్ర గాయాలు కాగా వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది .మిగతా ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ఇట్టి సంఘటన స్థలాన్ని నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,పర్యవేక్షించి , పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కారు డ్రైవర్ అతివేగముగా అజాగ్రత్తగా నడపడం వలన ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని తెలిపారు.ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని , ముఖ్యంగా బైపాస్ రోడ్డులో అతివేగముగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు.ఈ సందర్భంగా డిచ్పల్లి ఎస్సై ఎండి ఆరిఫ్ , నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ మరియు తదితరులు గలరు.
నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి.
Published On: March 5, 2026 2:16 pm











