మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవు ఎస్ ఐ సుహాసిని.

జై భారత్ దినపత్రిక మెండోరా మార్చ్ 25 : నిజామాబాద్ మెండోరా మండల కేంద్రంలోని వివేకానంద సర్కిల్ వద్ద రోడ్డు భద్రతకు సంబంధించి “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెండోరా ఎస్సై సుహాసిని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఫోర్ విల్లర్ నడిపే వారు కచ్చితంగా సీట్ బెల్ట్ ని వినియోగించాలని ఆమె సూచించారు. రహదారిపై కుడి వైపునుండే ఓవర్టేక్ చేయాలని,ఎడమ వైపు వెళ్లి ప్రమాధానికి గురి కావద్దని,మద్యం సేవించి వాహనాలు నడిపితే రూపాయలు 10,000 జరిమానా లేదా జైలు శిక్ష తప్పదని. ఆమె అన్నారు. మైనర్ లకు ఎట్టి పరిస్థితిలో వాహనాలు ఇవ్వొద్దని పేర్కొన్నారు. అతి వేగం,నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదాలకు దారి తీస్తాయని SI జాదవ్ సుహాసిని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ ఉప సర్పంచ్ మిట్టపల్లి రాజేశ్వర్ మరియు పోలీసు సిబ్బంది,వాహనదారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment