ఎటియంలను గ్యాస్ కట్టర్ లతో కోసీ 42 లక్షల అపహరణ
తెల్లవారుజామున నగరంలో ఏటీఎం చోరీ ముఠా దుశ్చర్య
నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ కుమార్) నిజామాబాద్ నగరంలో రెండు ఎటియంలలో దొంగలు దొంగతనాలకు పాల్పడ్డారు. ముప్పై నిమిషాల వ్యవధిలో రూ.42 లక్షల నగదు చోరీ చేశారు. ముందుగా నగరంలోని వర్నిరోడు లోని ఎస్ బి ఐ బ్యాంకు ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు.. వర్ని రోడ్డు ఎస్ బి ఐ ఏటీఎం లో తెల్లవారుజామున 3.10 నిమిషాలకు ఎంటియంలో ప్రవేశించి గ్యాస్ కట్టర్ తో కోసి రూ.15 లక్షల నగదు చోరీకి పాల్పడ్డారు. కార్ లో వచ్చిన 5గురు అగంతక ముఠా ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 3.22 నిమిషాలకు గ్యాస్ కట్టర్ లతో నగరంలోని హైదరాబాద్ రోడ్డులోని బ్యాంకు కాలనీ( పాంగ్రా) లోని డి సి బి బ్యాంక్ ను కొల్లగొట్టారు. అందులో 27 లక్షల నగదు వరకు ఉండగా గ్యాస్ కట్టర్ లతో కోసి చోరీకి పాల్పడ్డారు. సంబంధిత ప్రాంతంలో ఉన్న సిసి టివి పుటేజీ ను పరిశీలిస్తున్నారు. అంతర్ రాష్ట్ర ఎటిఎంలలో చోరీకి పాల్పడే ముఠా పని అని అనుమానిస్తున్నారు. చోరి అనంతరం సంబంధిత ముఠా కార్ లో మాధవ నగర్ వైపు వెళ్లినట్టు తెలిసింది. ఘటన స్థలాన్ని నిజామాబాద్ డిసీపీ బస్వారెడ్డి, ఎసిపీ రాజా వెంకట్ రెడ్డి, నాల్గవ టౌన్ ఎస్ హెచ్ ఓ సతీష్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ స్థానిక ఎస్ఐల పరిశీలించారు. ఎటిఎంలలో చోరిలకు పాల్పడిన ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. రహదారులపై ఉన్న పోలిస్ స్టేషన్ లకు సంబంధిత కార్ అచూకి కోసం తనిఖీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. పకడ్బందింగా రెక్కి అనంతరం ముఠా చోరీలకు పాల్పడిందని అనుమానిస్తున్నారు.









