ట్రాఫిక్ సిఐ, ఎస్సె పై దాడి -అదుపులోకి తీసుకొని త్రీటౌన్ కు తరలించిన పోలీసులు

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : జిల్లా కేంద్రంలోని రైల్వేకమన్ వద్ద ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ తాగుబోతు ట్రాఫిక్ సిఐ, ఎస్సైపై దాడి చేశాడు. ఆర్మూర్ నుండి నిజామాబాద్ కు కారు లో వస్తుండగా రైల్వేకమన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ని బ్రీతింగ్ అనలైజర్స్ ఉదుమని అడుగగా దానికి అతను నిరాకరించి మేము తాగడం వల్లనే మీకు జీతాలు వస్తున్నాయి అంటూ పోలీస్ లతో వాగ్వాదానికి దిగడంతో ట్రాఫిక్ సీఐ సముదయించే ప్రయత్నం చేయగా తాగుబోతు ఒక్కసారిగా సీఐ, ఎస్ఐ లపై దాడికి పాల్పడ్డాడు.అతిగా మద్యం సేవించినట్లు నిర్ధారణ చేసుకున్న ట్రాఫిక్ పోలీస్ లు తాగుబోతును మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి పిర్యాదు చేయగా పోలీస్ లు కేసు నమోదు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment