ఆర్మూర్ జై భారత్ అక్టోబర్ 18 : తెలంగాణ టీపీసీసీ మరియు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కొరకు తెలంగాణ బంద్ పాటించడం జరిగింది.బీసీ కుల సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపుకు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై తమ పూర్తి మద్దతు తెలిపి బంద్ లో పాల్గొనడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్మూర్ కాంగ్రెస్ బీసీ సెల్ నాయకులు, బీసీ కుల సంఘాలు, నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని తెలంగాణ బంద్ విజయవంతం చేయడమైనది…
తెలంగాణ బంద్ విజయవంతం
Updated On: October 18, 2025 10:40 pm











