మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ మృతి.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 18 : నిజామాబాద్ నగరానికి చెందిన బీజేపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ (42) మృతి చెందారు. బుధవారం తెల్లవారు జామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పంచరెడ్డి సురేష్ భార్య అనిత ప్రస్తుతం 16 వ డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన విషయం తెలిసిందే. సురేష్ మృతిపై పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలను నేడు జరగనున్నాయి.గతంలో కార్పొరేటర్ గా సేవలు పంచరెడ్డి సురేష్ నగరంలోని 16వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేశారు. ఆయన ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్లో కొనసాగారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సమయంలో బీజేపీ చేరారు. దీంతో ఆయన భార్య పంచరెడ్డి అనిత కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆమె కార్పొరేటర్ గెలుపొందిన విషయం తెలిసిందే. సురేష్ మరణం పట్ల యువత తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.అందరితో సోదరా భావంతో ఉండే సురేష్ ప్రస్తుతం లేడు అన్న సంగతి దుబ్బ ప్రాంతావాసులకు కలిచివేస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment