వారం రోజుల్లో 230 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు,21,60,000 జరిమానా విధించిన కోర్టులు.

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : జిల్లావ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో 230 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈనెల తొమ్మిది నుండి 14వ తేదీ వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 230 కేసులు నమోదు చేశారు. వీరిని సంబంధిత కోర్టులలో హాజరు పరచగా రూ 21,60,000 జరిమానా విధించడం జరిగిందని సిపి తెలిపారు వీరిలో 14 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు.ప్రజలు మద్యం సేవించే వాహనాలు నడపరాదని వాహనదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రాలు సక్రమంగా తమ వద్ద ఉంచుకోగలరన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment