జల్సాల కోసం ఆటో చోరీ నిందితుడి అరెస్ట్.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : జల్సాల కోసం ఓ యువకుడు చోరీలకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆదివారం వివరాలు వెల్లడించారు.నాందేడ్లో విక్రయానికి తీసుకెళ్తుండగా నగరంలోని న్యాల్కల్ రోడ్ నివాసి అయిన జిన్నా నర్సింలు ఈనెల 12న తన ఆటో చోరీకి గురైందని ఐదో టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీ పుటేజీలను పరిశీలించారు. అనంతరం నెహ్రూనగర్కు చెందిన నిందితుడు షేక్ నయీంను అదుపులోకి తీసుకున్నాడు. తాగుడు, జల్సాలకు అలవాటు పడ్డ నిందితుడు డబ్బుల కోసం ఆటో చోరీ చేసి విక్రయిద్దామని నిర్ణయించుకున్నారు.వలపన్ని పట్టుకుని ఈ మేరకు ఆర్ఆర్ చౌరస్తా వద్ద పార్క్ చేసిన ఆటోను చోరీ చేసి నాందేడ్లో విక్రయించేందుకు బయలుదేరాడు.ఈ క్రమంలో పోలీసులు వలపన్ని అతడిని అర్సపల్లి బైపాస్ వద్ద ఆటోతో సహా పట్టుకున్నారు.నిందితుడు నేరం అంగీకరించాడని.. అతడిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపర్చి అనంతరం రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.ఈ కేసు ఛేదనలో చురుకుగా వ్యవహరించిన ఎస్సై గంగాధర్, ఐదో టౌన్ సిబ్బందిని సీఐ శ్రీనివాస్ అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment