మహిళా హత్య కేసును 20 గంటలలో చెందించిన పోలీసులు.
సి. సి కెమెరాల ఆధారాలతో లభ్యం , ఒకరి అరెస్ట్
సిబ్బందినీ అభినంధించిన పోలీస్ కమీషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 26 : నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధి మల్కాపూర్ గ్రామంలో నవంబర్ 24న జరిగిన మహిళ హత్య కేసును నిజామాబాద్ నార్త్ రూరల్ సర్కిల్ పోలీసులు వేగంగా, వివిధ కోణాల్లో పరిశీలించి, విచారించి, నిందితుడిని అరెస్ట్ చేసి కేసును చేధించారు.
నిందితుడు విచారణలో చేసిన అంగీకార వాంగ్మూలం ప్రకారం.
మృతురాలి బంధువు అయినా కుమరం అలియాస్ పాండవల, గృహ నిర్మాణానికి డబ్బులు అవసరం కావడంతో, తన మేనకోడలు ఆకుల అనంత అలియాస్ సోనీ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించాలనే ఉద్దేశంతో నవంబర్ 24న ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సందర్భంలో ఆమె ఒంటరిగా ఉండడంతో, ఆమెను గొంతు నులిమి హత్య చేసి, చెవుల్లో ఉన్న కమ్మలు, మాటిలు, మెడలో ఉన్న బంగారు పుస్తెలు తాడు దొంగిలించాడు.అనంతరం మృతదేహాన్ని ఇంటి లోపలి గదిలో దాచివేసి, బంగారంలో కొంత భాగం కమ్మలు 1.5 గ్రాములు, ముత్తూట్ ఫైనాన్స్, బోధన్ బస్ స్టాండ్ బ్రాంచ్‌లో తాకట్టు పెట్టి 12,500 రూపాయల రుణం పొందాడు.మిగిలిన మాటి, పుస్తెలు తాడు 13.5 గ్రాములు తన వద్దే ఉంచుకున్నాడు.సంఘటన వెలుగులోకి రాగానే పారిపోయిన నిందితుని, బుధవారం ఉదయం నిజామాబాద్ బస్ స్టేషన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. దొంగలించిన బంగారాన్ని పోలీసులు స్వాధీనం పరుచుకునీ రిమాండ్‌కు తరలించారు.ఇట్టి కేసు చేధనకు నిజామాబాదు ఎ. సి. పి రాజా వెంకట్ రెడ్డి నేత్రుత్వం లో నిజామాబాదు నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్ అధ్వర్యంలో టీం లుగా ఏర్పడి , కేసును వివిధ కోణాలలో పరిశోధించి ఇట్టి హత్య కేసులో నిందితులు గా ఉన్న కుమరం అలియాస్ పాండవల ను పట్టుకున్నారు, నిందితులను పట్టుకున్న ఎస్సే లు తిరుపతి, యాదగిరిగౌడ్, , గఫార్ ఏ ఎస్సే, రాజేశ్వర్ క్రైమ్ టీమ్ మరియు నవీపేట్ పిఎస్ సిబ్బంది అందరిని నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్ అభినందిoచారు.









