గల్ఫ్ దేశాలలో ఉద్రిక్త పరిస్థితులలో చిక్కుకున్న వారి సహాయార్థం కోసం కంట్రోల్ రూమ్.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 02 : గల్ఫ్ దేశాలలో ఉద్రిక్త పరిస్థితులలో చిక్కుకున్న వారి సహాయార్థం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ కమిషనర్ వెల్లడి.ఇందు మూలంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా గల్ఫ్ దేశాలలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిజామాబాదులో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.తెలంగాణ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం న్యూఢిల్లీలో ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ వారి తో సమన్వయం చేసుకుంటూ నిజామాబాద్ జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో నిజామాబాదు పౌరులు ఉన్న వారి కుటుంబ సభ్యుల సమాచారం కోసం నిజామాబాద్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ నిజామాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659700 పోలీస్ కంట్రోల్ రూమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్  8712659821 కు సంప్రదించగలరని  నిజామాబాదు పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య తెలియజేయడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment