కాంగ్రెస్ నేతలను దూషించే హక్కు కేటీఆర్ కు లేదు–డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05:(నవీన్ కుమార్) కాంగ్రెస్ నాయకులను దూషించేహక్కు కేటీఆర్ కు లేదని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ. సీఎం రేవంత్రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డిని కేటీఆర్ అవమానించడమంటే ఆది కేటీఆర్ అవివేకానికి, అహంకారానికి నిదర్శనమని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని కేటీఆర్ అబద్దపు మాటలు మాట్లాడుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు దళితులకు మూడెకరాల భూమి, దళిత సీఎం, పేదవాళ్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చారన్నారు. వచ్చాక ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీల మేరకు అధికారంలోకి రాగానే అమలు చేస్తోందన్నారు. కార్యక్రమం లో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా గ్రం థాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ సభ్యులు జావిద్ అక్రం, సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, నాయకులు యాదగిరి, నర్సారెడ్డి, రాజేందర్, శోభన్, కౌశిక్, దేగం గంగారెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment