నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 : నిజామాబాద్–బోధన్ ప్రధాన రహదారిలోని అర్పాపల్లి నుంచి నెహ్రునగర్ వరకు రోడ్డు వెడల్పు చేపట్టాలని కోరుతూ MPJ (Movement for Peace & Justice) ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు మొహమ్మద్ అలీ షబ్బీర్ గారికి మెమోరాండం అందజేశారు. ప్రమాదకారంగా ఉన్న ఈ రహదారి పై ఎన్నో ప్రాణాలను బలిగొన్న చూసి చూడనట్టు చేస్తున్న అధికారులు. ప్రభుత్వాలు మారిన రోడ్డు దుస్థితి ఇంతే.అనేకసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు.ఈ రోడ్డుపై డివైడర్ లేకపోవడం, వెడల్పు తక్కువగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రాణాలకు ప్రాణాలు విడుతున్నాయని MPJ నాయకులు వివరించారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారిన ఈ రహదారిని వెంటనే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అర్పాపల్లి నుంచి నెహ్రునగర్ వరకు 4 లైన్ రోడ్డు నిర్మాణంతో పాటు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.ఈ కార్యక్రమంలో MPJ అధ్యక్షుడు జహీరుద్దీన్, సభ్యులు షేక్ హుస్సేన్, సజ్జాద్ హుస్సేన్, షేక్ అస్లం, రఫీక్ ,అమ్జద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
బోధన్ రోడ్డు వెడల్పు కోరుతూ ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ అలీ షబ్బీర్‌కు MPJ మెమోరాండం.
Published On: December 30, 2025 8:15 pm











