గాడ్కోల్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి

నిజామాబాద్  బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : ( నవీన్ కుమార్) సిరికొండ మండలంలోని గాడ్కోల్ గ్రామంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి హాజరై నూతన కార్యవర్గాన్ని శాలువా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని స్థానికంగా జరిగిన ఎన్నికల్లో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసిన 30% మించకుండా ఓట్లు పోలయ్యాయని నిజామాబాద్ రూరల్ లో 140 గ్రామపంచాయతీలలో 60 శాతం ఓట్లతో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని మహిళలు యువకులు విద్యావంతులు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన ను కోరుకోవడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కొరకు కృషి చేస్తుందని రైతులకు ఇబ్బంది కాకుండా రైతులకు బోనస్, మరియు చివరి గింజ వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని అన్నారు. అలాగే మహిళల అభ్యుదయానికి పావుల వడ్డీకి రుణాలను ఇవ్వడం జరుగుతుందని దీని ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెల్మ భాస్కర్ రెడ్డి, ఉమ్మాజీ నరేష్, గొల్ల ఎర్రన్న, మండల అధ్యక్షుడు బాకారం రవి, మునుపెల్లి సాయి రెడ్డి, శేఖర్ గౌడ్, బాకారం సంతోష్, నూతన పాలకవర్గం, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment