వసతి గృహాల అభివృద్ధి కోసం కృషి చేయాలి–పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : విద్యార్థుల అభ్యున్నతి, వసతి గృహాల అభివృద్ధి కోసం కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.ఆదివారం నగరంలోని పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ప్రమాణం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో కొనసాగేందుకు ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని ఈ సందర్భంగా ప్రముఖులు వివరించారు. వసతి గృహాన్ని ఆధునికీకరణ చేయడానికి నూతన కమిటీ కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, పద్మశాలి సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment