బిజెపి నేతలు ఏ మొహం పెట్టుకుని మహా ధర్నా చేస్తున్నారు–పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.
నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : (నవీన్ కుమార్) తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేదని పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం పీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ… బిజెపి పార్టీ హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా ధర్నా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టిన అసమర్థత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఆరోపణలు చేశారు. ఏ మొహం పెట్టుకొని బిజెపి పార్టీ నేతలు ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నార ని మండిపడ్డారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రజలతో శభాష్ కొట్టించుకుంటుందని ఇది చూసి ఓర్వలేక బిజెపి నేతలు మహా ధర్నా పేరిట ప్రజలను ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మోసం చేసే కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. ఇందుకు ఉదాహరణనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనీసం బీజేపీ పార్టీ డిపాజిట్ దక్కించుకోలేని కిషన్ రెడ్డిఆలోచించాలన్నారు. గ్లోబల్ సమ్మిట్ గర్వంగా జరుపుకుంటున్నాం అని అన్నారు. ప్రజల మెప్పు పొంది ప్రజల ముందు గర్వం గా నిల్చున్నామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాకం వల్ల 8 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చారన్నారు. ఒకవైపు వడ్డీలు కడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వచ్చే మూడేళ్లలో ఇచ్చిన హామీలు ಅನ್ನಿ తప్పకుండా నెరవేరుస్తామన్నారు. పీసీసీ చీప్ తో పాటు జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామ క్రిష్ణ తదితరులు ఉన్నారు.









