జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి.
కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : పార్టీ ప్రాణంగా, సిద్ధాంతాలను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకునిగా ఉంటున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కి మంత్రి పదవి ఇవ్వాలని ఆదివారం కామారెడ్డి జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక దశలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేసిన పార్టీ మారకుండా, పార్టీ కోసం పని చేసిన షబ్బీర్ అలీ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రిని చేయాలని పేర్కొన్నారు. ఏ పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం తన కోన ఊపిరి వరకు పార్టీలోనే కొనసాగుతానని ఏనాడో ప్రకటించిన కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్ముకున్న నాయకుడు షబ్బీర్ అలని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న లేకున్నా, పార్టీ కోసం పనిచేసిన నాయకులకు తగిన పదవుల ఇచ్చి గౌరవించాలని, కష్ట కాలంలో పార్టీ కోసం ఎన్ని కష్టాలు పడ్డారో గుర్తించాలని సూచించారు. పది కాలాలపాటు పార్టీ అధికారంలో ఉండాలంటే కష్టపడిన వారిని గుర్తించాలని సూచించారు.











