మోపాల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ

దేశభక్తి,సామరస్య భావాలను యువతలో పెంపొందించుకోవాలి –మోపాల్ ఎస్ఐ. జెడ్ సుస్మిత

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 31 : సర్దార్ వల్లభభాయి పటేల్  జయంతిని పురస్కరించు కొని రాష్ట్రీయ సమన్వయ దినోత్సవం సందర్భంగా మోపాల్ మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం” రన్ ఫర్ యూనిటీ”కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కస్బగ్ తాండ నుండి ముదకు పల్లి పల్లి చౌరస్తా వర కు సుమారు 2 కిలోమీటర్ల మేర నిర్వహించిన రన్ విద్యార్థులు,పోలీసులు,యువకులు,ప్రజా లో ప్రతినిధులు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సర్దార్ వల్లభభాయి పటేల్ దేశ ఐక్యత, సమగ్రత కోసం చేసిన కృషిని అధికారులు స్మరించారు.

ఈ కార్యక్రమం లో పాఠశాల విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.దేశభక్తి,సామరస్య భావాలను యువతలో పెంపొందించుకోవాలని మోపాల్ ఎస్సై సుష్మిత పిలుపునిచ్చారు. ఈ సందర్భం గా ఎస్సై జెడ్ సుస్మిత మాట్లాడుతూ,“సర్దార్ వల్లభభాయి పటేల్ చూపించిన ఐక్యతా మార్గం ప్రతి భారతీయుడు అనుసరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయ వంతంగా పూర్తి కావడంలో పోలీసు సిబ్బందితో పాటు విద్యా సంస్థల సహకారం విశేషమని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment