ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29: (నవీన్ కుమార్) బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కని, వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశాను. ఈ సందర్భంగా గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మాధవ్ నగర్, అర్సపల్లి మరియు అడవి మామిడిపల్లి ఆర్వోబీలకు సంబంధించి సుమారు 13.5 కోట్ల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరాను. మంత్రి భట్టి సానుకూలంగా స్పందించి, పెండింగ్ బిల్లులను సత్వరమే విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేశాను.
ఆర్వోబీల పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి–ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ను కోరిన ఎంపీ అర్వింద్
Published On: October 29, 2025 8:55 pm









