ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు అడిగితే కాంగ్రెస్ నుంచి బహిష్కరణ– షబ్బీర్ అలీ

నిజామాబాద్ జై భారత్ జూన్ 30: (షేక్ గౌస్) ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల వద్ద కాంగ్రెస్ నాయకులు లేదా కమిటీ సభ్యులు ఎవరు డబ్బులు అడిగినా, వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ హెచ్చరించారు.సోమవారం ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన సభలో డివిజన్ 28, 29, 30ల ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రాసెసింగ్ కాపీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ‘‘ ఇందిరమ్మ ఇండ్లు పేదల హక్కు, వీటి మీద ఎవరూ చేతులు వేయకూడదు. కాంట్రాక్టర్‌ల్లా వ్యవహరిస్తూ డబ్బులు అడిగితే, వారిని పార్టీలో ఉంచం. ఇలాంటి అంశాల్లో అసలు సంశయం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం,’’ అని స్పష్టంచేశారు.అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా పేదల ముఖాల్లో సంతోషం చూడటం తనకు గర్వంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిజమైన సంక్షేమం ఉంటుందని, ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఉచిత సన్న బియ్యం, మహిళల కు ఉచిత బస్సు ప్రయాణం , ఉచిత విద్యుత్ లాంటి మరిన్ని పథకాలు కూడా ప్రజల కష్టాలను తీర్చేలా అమలు చేస్తున్నామని తెలిపారు.ఇట్టి కార్యక్రమం లో నూడా చైర్మెన్ కేశ వేణు, నాయకులు రత్నాకర్, జావేద్ అక్రమ్, సమీ, హారూన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!