మూడు సార్లు ప్రారంభోత్సవాలు… రైతులకు లాభం ఏంటి?-బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తీవ్ర విమర్శ

నిజామాబాద్ జై భారత్ జూన్ 30: నిజామాబాద్ ప్రతినిధి: ఒకే పసుపు బోర్డు కోసం మూడు సార్లు ప్రారంభోత్సవాలు చేస్తూ, నిజామాబాద్‌లో నేమ్‌ప్లేట్ పెట్టి, అసలు కార్యాలయం మాత్రం డిల్లీలో నడిపిస్తూ కేంద్రం మళ్లీ రైతులను మోసం చేసిందని బీఆర్‌ఎస్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు.ఎన్నికలప్పుడు ఐదు రోజుల్లో బోర్డు తెస్తానని ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ రాసి ఇచ్చారని, కానీ పదేళ్లైనా ఆ మాట నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. స్పైసెస్ బోర్డునే పసుపు బోర్డు అని చెప్పడం, మూడు సార్లు ప్రారంభోత్సవాలు చేసుకోవడం కేవలం రైతులను మభ్యపెట్టడం అని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ప్రభుత్వం కట్టిన భవనంలోనే బోర్డు పెట్టుకుని, అదే కేసీఆర్ ను బీజేపీ నాయకులు విమర్శించడం విడ్డూరమని ధ్వజమెత్తారు. పసుపుకు క్వింటాకు 15 వేలు మద్దతు ధర ఇస్తామన్నారు, కానీ మాట తప్పి, దళార్ల చేతిలో రైతులు మోసపోతుంటే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!