ఈనెల 29న కేంద్రమంత్రి అమిత్ షా నిజామాబాద్ కు రాక.

ఫోన్ ట్యాపింగ్ చేసిన సిబిఐ కి అప్పగించాలి. 

జిల్లాకు మంత్రి పదవి రాకపోవడం శోచనీయం. మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్.

నిజామాబాద్ జై భారత్ జూన్ 23: ఈనెల 29న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. నిజామాబాద్ బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నట్లు ఎంపీ వెల్లడించారు. పసుపుబోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్ లో ప్రారంభించుకోవడం ఒక చారిత్రాత్మక రోజుగా ఆయన అభివర్ణించారు.పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు నూతన శకం ప్రారంభం అయిందని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. దేశంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును వెంటనే సిబిఐ కి అప్పగించాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితులను వెంటనే జైలుకు పంపాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన బీజేపీ సిద్ధంగా ఉందని ఎంపీ అరవింద్ అన్నారు.రాజకీయ చైతన్యం ఉన్న నిజామాబాద్ జిల్లాకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వకపోవటం శోచనీయమన్నారు.అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.రానున్న ఎన్నికలలో ఒక హరీశ్ రావు ఒక్కడే గెలుస్తాడని ఎంపీ అరవింద్ జోస్యం చెప్పారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చీలికలు తప్పవని ఆయన వెల్లడించారు.కేటిఆర్ తో సహా అందరూ ఓడిపోవడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేయడని ఆయన అన్నారు. తెలంగాణ సమాజం బీఆర్ఎ ఎస్ ను ఎప్పటికీ క్షమించదని ఎంపీ అరవింద్ అన్నారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మోహన్ రెడ్డి, స్రవంతి రెడ్డి, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!