భారీ ఈదురు గాలులు వీచిన సందర్భంగా పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ

నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని సోమవారం రాత్రి విసిన భారీ ఈదురు గాలులకు ఎన్నో భారీ చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు నేలకు వరగడంతో ప్రయాణికులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరియు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలని, JCB ల సహాయం తో చెట్లను తొలగించాలని సంబంధిత సిబ్బందికి నిజామాబాదు పోలీస్ కమీషనర్  పి. సాయి చైతన్య, IPS. తెలియజేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్  స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ఇలాంటి ఆపత్కాల పరిస్థితులలో ప్రజలు వెంటనే పోలీస్ లకు సమాచారం అందిస్తే అవసరం అయిన సహాయం అందిస్తామని , ప్రజల భద్రత సౌకర్యం కోసం పోలీసులు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.

కమిషనర్ సాయి చైతన్య రూరల్ ఎస్ఐ ఆరిఫ్, రూరల్ పరిధిలో పర్యవేక్షించగా  తన సిబ్బందితో  రోడ్డు పై చెట్లు పడిపోయిన స్థలానికి చేరుకున్నారు. జేసీబి సహాయంతో చెట్లను తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. పోలీసులు వేగంగా స్పందించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment