నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సంక్షేమ నాయకు లు, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ బీ.సీ. గ్రాడ్యుయేషన్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరీ నీడ దశరథ్, రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పు రాజేందర్ ముదిరాజ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాటూరి శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు ఎల్లోల్ల సురేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బిజ్జరం అంబాదాస్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బుస మహేష్ ముదిరాజులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాల నాయకులు, ఒక తాటి పైకి రావాలని, ఎవరికి వారే బిజీ సంఘాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదే అయినప్పటికీ, ఎన్నికల్లో మాత్రం అన్ని బీసీ సంఘాలు సమావేశం ఏర్పాటు చేసుకొని, నిర్ణయం సమావేశంలో ఏర్పాటు చేసుకొని, బీసీల కోసం ప్రజల కోసం, నిరంతరం కృషి చేసే అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్ ను గెలిపించేందుకు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. అదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజాంబాద్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలో ఉన్న, బీసీ సంక్షేమ సంఘం అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్ ను, ప్రతి బిసి కుల సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, యువత, విద్యార్థిని, విద్యార్థులు, వివిధ ఉద్యోగుల సంఘ నాయకులు, ఉద్యోగులు ఇప్పటికైనా మేల్కొని, తమ ఉద్యోగ సంఘాల అతీతంగా, మన బీసీ నాయకుడైన అబ్బ గోని అశోక్ గౌడ్ ను, పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా, వివిధ ఉద్యోగ సంఘాల అతీతంగా, బీసీ సంఘాల కతీతంగా తమ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యతక మన నిజాంబాద్ జిల్లాకు చెందిన, ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామంలో బీసీల కోసమై, బీసీ ఉద్యోగ సంఘాల కై, బీసీ కుల సంఘాల ప్రజల కై, బీసీ ఉద్యోగుల కోసం, విద్యార్థుల కోసం ప్రతి బీసీకి అందుబాటులో ఉండేందుకు కార్యాలయం ఏర్పాటు చేసుకొని నివాసముంటు, ప్రతిబిసి కి వచ్చిన సమస్యను పరిష్కరిస్తూ, బిసి ప్రజల మన్ననలు పొందుతున్న , తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ బిసి గ్రాడ్యుయేషన్ ఫోరం అధ్యక్షులు, ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు, బీసీలను కోరారు.








