నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 10.
గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కేటీఆర్ మరియు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు బాల్కొండ మండలంలోని వన్నెల్ బి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాభిషేకం చేయడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చినందుకు తెలంగాణ తల్లి అపవిత్రమైందని భావిస్తూ బాల్కొండ మండల బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి దాసరి వెంకటేష్ , తాజా మాజీ ఎంపీపీ లింగా గౌడ్ , సొసైటీ చైర్మన్ సూరజ్ రెడ్డి , బాల్కొండ పట్టణ అధ్యక్షుడు సాగర్ యాదవ్, నోముల మోహన్, శ్రీకాంత్ యాదవ్, మండల యువజన అధ్యక్షుడు గాండ్ల రాజేష్, జేట్టి జనార్దన్, ఇఫ్తేకర్, ఫయాస్, గడ్డం మహేష్, పన్నాల గంగారెడ్డి, అర్జున్ సింగ్, మామిడి నరసయ్య, గడ్డం సాయన్న మరియు తదితరులు పాల్గొన్నారు.