డ్రంక్ అండ్ డైవ్ లో పట్టుబడిన 130 మంది మందు బాబులు

జై భారత్ దినపత్రిక  నిజామాబాద్ జిల్లా బ్యూరో జనవరి 01 : నిజామాబాద్ జిల్లాలో గతేడాది చివరి రోజు మద్యం సేవించి వాహనాలు నడిపిన 130 మందిని పట్టుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. బుధవారం రాత్రి నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ఈ తనిఖీ లలో మందు బాబులు భారీగా పట్టు బడగా వారిపై కేసులు నమోదు చేశామని, మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని సీపీ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment