కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అర్వింద్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : (నవీన్ కుమార్) నిజామాబాద్ పట్టణంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోమవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ వెంట ఉన్నారు.

లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది: ఎంపీ అరవింద్

లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా గత ఐదు, పదేళ్లలో నిజామాబాద్ జిల్లాలో గన్ కల్చర్ పెరిగిపోవడం దురదృష్టకరమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment