రెవెన్యూ అసోసియేషన్ అనుబంధంగా,జి పి ఓ ల జిల్లా నూతన కార్యవర్గ సంఘం ఎన్నిక

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : (నవీన్ కుమార్) ఆదివారం నిజామాబాద్ జిల్లా గ్రామ పాలన అధికారుల నూతన కార్యవర్గ ఎన్నిక స్థానిక రెవెన్యూ భవన్లో జరిగింది.ఎన్నిక ఏకగ్రీవంగా అందరు కలిసి ఎన్నుకోవడం జరిగింది.నూతన జిల్లా అధ్యక్షుడిగా బియ్య సాయినాథ్,ప్రధాన కార్యదర్శిగా గుణ్ణం సంతోష్,కోశాధికారిగా నల్ల ప్రశాంత్ ఉపాధ్యక్షులుగా అబ్బ సుధాకర్, నీరడి రమేష్, గంగాధర్,మహిళా అధ్యక్షురాలిగా గంగాభవాని,కార్యవర్గ సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఎన్నుకోబడిన నూతన అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జి పి ఓ ల హక్కుల కొరకు సమస్యల కొరకు నిరంతరం పాటు పడతామని ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని అలాగే రెవెన్యూ అసోసియేషన్ కు అనుబంధంగా ఉంటామని వారి సూచనలు సలహాలు పాటిస్తామని తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment