ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షలుగా ఎన్నికైన ధర్మపురి సంజయ్ ను బొబ్బిలి వీధి యువకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట బొబ్బిలి వీధి మున్నూరు కాపు సంఘం యువకులు గురువారం బొబ్బిలి వీనిష్ (బిట్టు ) ఆధ్వర్యంలో ధర్మపురి సంజయ్ స్వగృహంలో సంజయ్ ను శాలువా, పూలమాలతో సత్కరించారు. సంజయ్ ను కలిసిన వారిలో బొబ్బిలి మహేష్, బొబ్బిలి మధుమోహన్, బొబ్బిలి అఖిలేష్, బొబ్బిలి నిఖిల్ లు ఉన్నారు.
సంజయ్ ను సత్కరించిన బొబ్బిలి వీధి యువకులు
Published On: October 30, 2025 10:07 pm









