నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 26 : 76వ భారత రాజ్యాంగ ప్రవేశిక సందర్బంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాను సారంగా అదనపు డి.సి.పి అడ్మిన్ బస్వారెడ్డి అదనపు డి.సి.పి ఎ.ఆర్ శ్రీ రామ చందర్ రావు,భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అదనపు డిప్యూటి కమీషనర్ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రవేశిక గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. తదుపరి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యాక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్స్ తిరుపతి వెల్ఫేర్, సతీష్ ,హోమ్ గార్డ్ లు, ఆఫీస్ సూపరింటెండెంటులు, బషీర్ , భరోసా సెంటర్ సిబ్బంది , పోలీస్ కార్యాలయ సిబ్బంది , ఆర్మ్డు రిజర్వ్ సిబ్బంది , స్పెషల్ పార్టీ సిబ్బంది , సి.సి.ఆర్.బి సిబ్బంది , పోలీస్ కంట్రోల్ రూమ్ , ఐ.టీ కోర్ సిబ్బంది , కమ్యూనికేషన్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










