జై భారత్ దినపత్రిక నందిపేట్ మార్చ్ 25 : నందిపేట్ మండలం మాయపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణం కోసం బుధవారం భూమి పూజ చేసి మొగ్గు వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బ్యాగరి జీవన్, ఉప సర్పంచ్ విష్ణు, కాంగ్రెస్ నాయకులు కిష్ణున్న సాగర్, మల్లేశ్, వార్డ్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేస్తే మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి సహకారంతో ప్రతి ఒక్కరికీ ఇళ్లు కల్పించడం లక్ష్యమని సర్పంచ్ పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ.
Published On: March 25, 2026 5:01 pm











