జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని జామతే ఇస్లాం ఆర్గనైజేషన్ ప్రతినిధి హుస్సేన్ అన్నారు.ఆదివారం రంజాన్ పండగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో ముస్లిం జర్నలిస్టులకు ఇఫ్తార్ విందును ప్రెస్ క్లబ్ కార్యవర్గం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచారెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్ లు మాట్లాడుతూ..ప్రెస్ క్లబ్ లో ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తామని, మత సమరస్యానికి ప్రత్యేకగా పండగను జరుపుకుంటామన్నారు.జర్నలిస్టులకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జమాతే ఇస్లామిక్ ప్రతినిధి హేఖ్ హుస్సేన్ మాట్లాడుతూ..మతసామరస్యానికి ప్రత్యేకత జరుపుకునే రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ లో జరపడం గొప్ప విషయం అన్నారు. ప్రతి సంవత్సరం కూడా జర్నలిస్టు మిత్రులకు ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. పవిత్ర రంజాన్ రోజుల్లో ఉపవాస దీక్షతో ఉండే జర్నలిస్టు సోదరులు ఆయురారోగ్యాలతో ఉండి అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు.అనంతరం సామూహికంగా ప్రార్థనలు చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఇఫ్తార్ విందుకు సహాయ సహకారాలు అందించిన వెల్నెస్ ఆస్పత్రి డైరెక్టర్లు అసత్ ఖాన్, సుమన్ గౌడ్, వివేకానంద రెడ్డి, మేనేజర్ వినోద్ కుమార్ లకు ప్రెస్ క్లబ్ పక్షాన నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ ప్రెస్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాజు, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గోవిందరాజ్, బైస సంగీత, ఈ సి సభ్యులు రవి చరణ్ రెడ్డి, భూమేష్, పప్పా ఖాన్, హైమద్ అలీ ఖాన్, ఎండి గౌస్, మాజీత్, అసద్, నయీమ్ క, ముకిత్ పారుకి, సయ్యద్ ఉస్మాన్, హాసిన్ అలీ, అన్వర్ ఖాన్, ఎంపీజే అలీమ్ కమార్, అజ్మత్ ఖాన్, జమాల్పూర్ గణేష్, రామ్ దయానంద్, అరవింద్ బాలాజీ, , శ్రీధర్, రాజేష్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగప్రెస్ క్లబ్ లో ఇఫ్తార్ విందు.
Published On: March 15, 2026 10:19 pm











