జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 02 : నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., 2026 హోలీకి ఆదేశాలు జారీ చేశారు.ఇష్టం లేని వ్యక్తులు, ప్రదేశాలు లేదా వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని బలవంతంగా చల్లడం నిషేధించబడింది.బహిరంగ ప్రదేశాల్లో ఇష్టపడని వ్యక్తులపై రంగులు పూయడం నిషేధించబడింది.ద్విచక్ర వాహనాలు లేదా ఇబ్బంది కలిగించే వాహనాల సామూహిక కదలిక నిషేధించబడింది.ఉల్లంఘించిన వారిపై నిజామాబాదు నగర పోలీసు చట్టం ప్రకారం కేసు నమోదు చేయబడుతుంది.ఈ ఆంక్షలు మార్చ్ 2న సాయంత్రం 6:00 గంటల నుండి మార్చ్ 5న ఉదయం 6:00 గంటల వరకు అమలులో ఉంటాయి.కల్లు దుకాణాలు , కల్లు డిపోలు , ఐ.ఎం.ఎల్ (ఎ 4) షాప్స్ / 2-బి బార్స్ / క్లబ్బులు / టి.డి-1 మరియు సిఎస్ -2 మార్చ్ 3న సాయంత్రం 6:00 గంటల నుండి మార్చ్ 5 ఉదయం 6:00 గంటల వరకు మూసి వేయబడతాయి అని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు.
నిజామాబాద్ లో హోలీ ఆంక్షలు జారీ చేసిన కమిషనర్
Published On: March 2, 2026 9:05 pm









