జై భారత్ దినపత్రిక బాల్కొండ జనవరి 19 :(భోజన్న) బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో పులి శెట్టి లింగన్న అనే వ్యక్తిపై వీడీసీలో కొందరు కక్షగట్టి గ్రామంలో ఉన్న అందర్నీ కూర్చోబెట్టి అతనిపై లేని పోనీ అబాండాలు వేయడంతో. లింగన్న నేను ఏలాంటి తప్పు చేయలేదు అని బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆగ్రహించిన కొందరు వీడీసీ సభ్యులు మమ్మల్ని కాదని నువ్వు పోలీస్ స్టేషన్ పోతావా అని పోలీస్ స్టేషన్కు వెళ్లి మాపై ఫిర్యాదు చేసినందుకు నీకు 50 వేల జరిమానా విధిస్తున్నాము. మరియు 17 మందికి 4000 రూపాయల కాడికి చెల్లించాలని హుకుం జారీ చేశారు. లేనియెడల సోషల్ బైకట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని లింగన్న ఆరోపించారు. నేను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వాళ్ల పైన చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుని నాకు తగిన న్యాయం చేస్తారని కోరుతున్నాను అని లింగన్న అన్నారు.
చిట్టాపూర్ లో వీడీసీ ఆగడాలు .
Published On: January 19, 2026 4:04 pm









