ప్రభుత్వ ముఖ్య సలహాదారు,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సర్పంచ్ నీరడి జ్యోతి రవి కుమార్ వినతి
నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ కుమార్) ఎడపల్లి మండలం పోచారం గ్రామం వెనకబడి ఉందని,తమ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి,సహక రించాలని ఆ గ్రామ నూతన సర్పంచ్ నీరడీ జ్యోతి రవి కుమార్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ,గత పాలకుల వైఫ ల్యంతో గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, ఎక్కడి సమ స్యలు అక్కడే ఉన్నాయని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి విన్నవించారు.ఈ సందర్భంగా వారు గ్రామంలో నెల కొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. పోచారం గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామస్తులు నిజామాబాద్ లోని అయన నివాసంలో సుదర్శన్ రెడ్డి ని సర్పంచ్ నీరడి జ్యోతి రవి తో పాటు వార్డు సభ్యు లు,గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్, వార్డు సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించి తమ గ్రామ అభివృద్ధి కి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము గ్రామ సర్పంచ్ గా గెలిస్తే అభివృద్ధి సాధ్యమని భావించి గ్రామ ప్రజలు తనపై ఉన్న నమ్మ కాన్ని వమ్ము చేయబోనని సర్పంచ్ నీరడీ జ్యోతితెలిపారు.మార్గదర్శకులు సుదర్శన్ రెడ్డి హయాంలో తన ను గెలిపించిన గ్రామ ప్రజలకు వమ్ము చేయకుండా అభివృద్ధి అంటే ఏమిటో చేతల ద్వారా చూపిస్తానని అన్నారు.ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆశీస్సులు అలాగే సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపేందుకు విస్తృత కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరడి సాయన్న, నీరడి రవికుమార్, వార్డు సభ్యులు, సుదర్శన్,జక్కు రాజ్ కుమార్,గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.









