ఇందిరమ్మ చీరను కట్టుకోవడం గౌరవంగా భావిస్తా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

ఆడబిడ్డలందరికీ నాణ్యమైన చీరలు అందజేస్తున్నాం

ఇందిరమ్మ చీరల పంపిణీ పై రాష్ట్రమంత్రి కొండా సురేఖ కీలక వాక్యాలు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి  జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ అందిస్తున్న నాణ్యమైన ఇందిరమ్మ చీరను తాను కూడా కట్టుకుంటానని పేద మహిళల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న పథకంలో భాగంగా పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరను కట్టుకోవడం తాను గౌరవంగా భావిస్తానని తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి మంత్రి సురేఖ హాజరయ్యారు. అనంతరం అక్కడే మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు నాణ్యమైన చీరలు అందించాలన్న సంకల్పంతోనే పంపిణీ కొంత ఆలస్యం జరిగిందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యతలేని చీరలు పంపిణీ చేసి చీరల పంపిణీ ప్రక్రియను మొత్తం అబాసుపాలు చేశారని మంత్రి ఎద్దేవా చేశారు. తమ ప్రజా ప్రభుత్వం మాత్రం ఉక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించామని వ్యాఖ్యానించారు. నాణ్యమైన చీరలు అందించే ఈ పథకాన్ని రెండు విడతలుగా అమలు చేస్తామన్నారు. మొదటి విడతలో భాగంగా నేటి నుంచి తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవమైన డిసెంబర్ 9 వరకు గ్రామీణ మహిళలకు చీరలు పంపిణీ పూర్తి చేస్తామన్నారు. రెండో విడతలో భాగంగా మార్చి 1: 2026 నుంచి పట్టణ ప్రాంత మహిళలకు చీరల పంపిణీ చేపడతామన్నారు. మొదటి విడతలో 65 లక్షల చీరలు రెండో విడతలో 35 లక్షల చీరలు పంపిణీ చేస్తామన్నారు. మొత్తంగా కోటికి పైగా నాణ్యమైన చీరలను కోటి మంది మహిళలకు అందించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అర్హులైన ప్రతి మహిళకు నాణ్యమైన చీర అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ ద్వేయమని మంత్రి అన్నారు. ఇందిరమ్మ చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారని. ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రెండు విడతల్లో పంపిణీ చేపడతామన్నారు. చీరల నాణ్యత విషయంలో రాజీ పడటం లేదని మంత్రి సురేఖ పునరుద్ఘాటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment