అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్- 8 మంది నేరస్థులు పట్టుబడ్డారు పోలీస్ కమీషనర్ వెల్లడి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 16 : శనివారం నవంబర్ 15 సాయంత్రం 5 గంటలకు ఇందల్వాయి వద్ద అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దోపిడీ ముఠాని పట్టుకొని 40 కిలోల కాపర్ కాయిల్స్ మరియు రూ.5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గత సంవత్సరం కాలం నుండి నిజామాబాద్ జిల్లా లోని, ఇందలవాయి, ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, ముగ్పాల్, బోధన్ టౌన్, బోధన్ రూరల్, నవీపేట్, వర్ని, మండలాల్లో ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తూ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసంచేసి అందులోని కాపర్ కాయిల్స్ దొంగలించి పారిపోవడం జరిగింది. అంతరాష్ట్ర దొంగల ముఠా లోని ఏడుగురు సభ్యులలో నుండి ఐదుగురిని నిన్న అరెస్టు చేయడం జరిగింది మరియు అట్టి దొంగలించిన కాపర్ కాయిల్స్ ను కొన్న ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగినది. వివరాల్లోకి వెళ్తే కింద తెలిపిన నిందితులు నిజామాబాద్ జిల్లా లోని పై పోలీస్ స్టేషన్ పరిదిలలో 101 ట్రాన్స్ ఫార్మర్ లను పగులగొట్టి అందులో వున్న కాపర్ కాయిల్స్ ను దొంగతనలకు పాల్పడగా 44 కేసులు నమోదు చేయబడినవి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి సాయి చైతన్య  ఆదేశాల మేరకు ఏ సి పి నిజామాబాద్ ఎల్. రాజ వెంకట రెడ్డి  ఆద్వర్యంలో స్పెషల్ టీం లను నియమించి శనివారం నాడు ఇందలవాయి మండల పరిధిలో గన్నారం వద్ద వాహనాలను తనికి చేస్తుండగా అనుమానం వచ్చి నిందితులను పట్టు కోవడం జరిగినది, ఇట్టి కేసు లకు సంబంధించి ఎ 1 నుండి ఎ 5 , ఎ 8 నుండి ఎ 10 లను అదుపులోకి తీసుకొని వారిని విచారించిన అనంతరం వారి వద్ద నుంచి 40 కేజీల కాపర్ కాయిల్స్, 5 లక్షల 50 వేల నగదు స్వాదినం చేసుకొని వారిని అరెస్ట్ చేసి కోర్ట్ ముందు హాజరుపరచడం జరుగుతుంది. రెండు స్కూటీ లు, 6 సెల్ ఫోన్ లు.ఇట్టి కేసుని ఛేదించడంలో ఏసిపి ఎల్. రాజ వెంకట రెడ్డి నిజామాబాదు  అద్వర్యంలో ముఖ్య పాత్ర వహించిన డిచ్ పల్లి సి ఐ . కె. వినోద్, ఇందల్వాయి ఎస్సై సందీప్, డిచ్ పల్లి ఎస్సై షరీఫ్, జక్రాన్ పల్లి ఎస్సై మహేష్, మరియు సిబ్బంది, పి. కిరణ్ గౌడ్ హెచ్ సి-1753, ప్రశాంత్  కానిస్టేబుల్ -3021, సందీప్ కానిస్టేబుల్ 2630, కిషోర్ కుమార్ కానిస్టేబుల్-2064, సుజిత్ కానిస్టేబుల్-2680, నవీన్ కానిస్టేబుల్-2610, జి. సర్ధార్ కానిస్టేబుల్-668 లను  కమిషనర్ ఆఫ్ పోలీస్  పి. సాయి చైతన్య నిజామాబాద్ అభినంధించారు.

       

Join WhatsApp

Join Now

Leave a Comment