నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో వాహనా దారులు మద్యం త్రాగి వాహనాలు నడుపడం వలన 45 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పలు పోలీస్ స్టేషన్ల వారిగా పట్టుబడిన వారికి సంబంధింత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి, వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో హజరు పర్చగా వారికి స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేటు నూర్జహన్ బేగం 20 మందికి జైలు 25 మందికి జరిమానా విధించడం జరిగింది. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించి పత్రాలను సక్రమంగా ఉంచుకోవలెను.మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారులకు చర్యలు తప్పవు అని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మందికి జైలు శిక్ష మరియు 25 మందికి జరిమాన
Published On: November 11, 2025 10:10 pm









