కామారెడ్డి ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహ ఆలయ అభివృద్ధికి హైదరాబాదుకు చెందిన ఆల్వాల్ ప్రాంత వాసులు ధర్మవరం శ్రీనివాస్ లక్ష్మి లు 5 లక్షల 51 వేలు, సిరిసిల్ల నివాసులు బాస నరసయ్య 5,51,000 రూపాయలు, చాట్ల దీక్షిత్ జనార్ధన్ లు 146 రూపాయలు మొత్తం కలిపి 11 లక్షల పదహారువేల16 రూపాయలు ఆదివారం పెద్ద మొత్తంలో ఆలయానికి విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు బ్రాహ్మణులు అందజేసిన భక్తులను శాలువాలతో సన్మానించి దేవుడు ఫోటోలను బహుకరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం లో జరుగుతున్న అభివృద్ధి పనుల కోసం ఈ నిధులు వెచ్చించాలని భక్తులు కమిటీ వారికి తెలిపారు.












