తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 31 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు.ఛాంబర్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే ఆరు గ్యారంటీల అమలుబాధ్యతలను సైతం ఆయనకు అప్పగించి కేబినెట్ హోదా కల్పించారు. సలహాదారు హోదాలో సుదర్శన్ రెడ్డి మంత్రి వర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.సెక్రటేరియట్లో మినిస్టర్లతో సమానంగా కేటాయించడంతో పాటు అన్నీ ప్రభుత్వ శాఖాధి పతులతో సంక్షేమ పథకాల అమలుపై సలహాలు, సూచనలు ఇచ్చేలా అధికారాలు కల్పించారు. కాంగ్రెస్ నేత అజరుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టిన అధిష్టానం.. సీనియర్లను బుజ్జగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అజార్దుద్దీన్ మంత్రి ప్రమాణం చేసిన కాసేపటికే సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి కీలక పదవి అప్పగించింది. బోధన్ నుంచి ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించడం పట్ల ఆయన వర్గీయులు, జిల్లా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
Published On: October 31, 2025 8:17 pm









