నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ బృందం సిబ్బంది , ప్రెసిడెన్సీ హైస్కూల్ మోపాల్ , మోపాల్ పోలీస్ స్టేషన్ వద్ద ఓ గంట వరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో దాదాపు (130) మంది సభ్యులు మరియు ఏ హెచ్ టి యు సభ్యులు పాల్గొన్నారు.మానవ అక్రమ రవాణా, కార్మిక అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, ఈవ్‌టీజింగ్, అవయవ సంరక్షణ, ఆశ్రయం, బాల్య వివాహాలు, పిల్లల లైంగిక వేధింపులు, సైబర్ స్టాకింగ్, సైబర్ బెదిరింపు, సైబర్ మోసాలు, అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ, మహిళా హెల్ప్ లైన్-1091–181–1098, చైల్డ్ హెల్ప్ లైన్, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ డయల్-1930 అత్యవసర కాంటాక్ట్ డయల్ 100–112 గురించి మేము వివరించాము. అలాగే ముందు జాగ్రత్త చర్యలు మరియు పంపిణీ చేసిన కరపత్రాల గురించి వివరించాము.
మానవ అక్రమ రవాణా నిరోధకం కోసము అవగాహన కార్యక్రమం
Published On: October 30, 2025 10:12 pm









