ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) ఆర్మూర్ పట్టణ వాస్తవ్యులు కుమ్మరి శంకర్ ఇటీవలే అనారోగ్యం తో బాధపడుతూ చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి విన్నవించడంతో వారు స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ ఓ సి నిజామాబాద్ ఇంచార్జి మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క ద్వారా 1,50,000/- లక్ష యాభై వేల రూపాయల ఎల్ ఓ సి కాపీని బాధిత కుటుంబ సభ్యులకు ఆర్మూర్ పివిఆర్ భవన్ లో గురువారం అందజేశారు. ఎల్ ఓ సి ఇప్పించిన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బాధిత కుటుంబానికి వినయ్ రెడ్డి ఎల్ ఓ సి అందజేత
Published On: October 30, 2025 9:13 pm









