ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : బుధవారం రోజున ఆర్మూర్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవ సంతాప దినాల సందర్భముగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి రక్తదాన శిబిరానికి ఏర్గట్ల మండల కేంద్రం నుండి 25 మంది యూత్ సభ్యులు పాల్గొని తమ యొక్క రక్తాన్ని పోలీసు వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో దానం చెయ్యటం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రక్తదానం చేసిన 25 మంది ఏర్గట్ల యూత్ సభ్యులను అభినందించారు.ఈకార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, భీంగల్ సీఐ సత్యనారాయణ గౌడ్, ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Published On: October 29, 2025 9:25 pm











