తడిసిన ధాన్యం పరిశీలన– బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : (నవీన్ కుమార్) ధాన్యం తడిసిపోతున్నందున కేంద్రాల్లో కొనుగోళ్ల వేగం పెంచాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలం కిష్టాపూర్, చించోల్లి, బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలిం చారు. ధాన్యం తడిసిన రైతులతో మాట్లాడారు. అనంతరం డీఎస్వోతో ఫోన్లో మాట్లాడి లారీల కోసం ఎదురుచూడకుండా తూకంవేసిన ధాన్యం బస్తాలను వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లు కూడా ధాన్యం బస్తాలు మిల్లుకు చేరగానే తక్షణమే దింపుకొని రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, తూకం వేసిన బస్తాలు, ధాన్యం రాశులపై పాలిథీన్ కవర్లు కప్పి రక్షించుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment