జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28: (నవీన్ కుమార్) బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు తో కలిసి ఎర్రగడ్డ డివిజన్‌లోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…2024 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ప్రాంతం నుండి బీజేపీకి 25,000 ఓట్ల మెజారిటీ రావడం ప్రజల నమ్మకానికి నిదర్శనం అన్నారు. అదే విశ్వాసంతో ఈ అసెంబ్లీ ఉపఎన్నికలో కూడా ప్రజలు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని ఆశీర్వదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.గడచిన 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం “ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్” పాలనగా మారిందని ధన్‌పాల్ సూర్యనారాయణ విమర్శించారు.రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇండ్లు — ఒక్కటీ అమలు కాలేదని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు.హైదరాబాద్ నగరానికి కనీస మౌలిక వసతులకైనా నిధులు కేటాయించలేకపోవడం రేవంత్ రెడ్డి పాలన వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. చిన్న వర్షానికే రోడ్లు మునిగిపోతున్నాయని, ప్రజల సమస్యలపై ప్రభుత్వం ఎటువంటి శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.2014–2023 మధ్య బీఆర్ఎస్ కుటుంబరాజకీయం, అవినీతి, భూస్కాంలతో ప్రజలను విసిగించిందని, ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని తెలిపారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను ప్రజలు తిరస్కరించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.బీజేపీ మాత్రమే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపగల పార్టీ అని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హైదరాబాద్‌కు కేంద్ర నిధులు, పథకాల ద్వారా అనేక ప్రయోజనాలు అందాయని చెప్పారు.జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడు కావాలని, లంకల దీపక్ రెడ్డి ప్రజల మధ్య ఉండే నాయకుడు అని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment