శివాలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు

కార్తీక మాసం మొదటి సోమవారం ఆలయంలో భక్తుల రద్దీ

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : (నవీన్ కుమార్) కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ నవనాథ సిద్దేశ్వర గుట్టపై గల శివాలయంలో వేలాదిగా భక్తులు విచ్చేసి పంచామృతాలతో బిల్వపత్రాలతో అభిషేకాలు నిర్వహించి, మహిళా భక్తులు ఉసిరికాయ నెయ్యి వత్తులతో దీపాలు వెలిగించి ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కార్తీక మాస విశిష్టత గురించి భక్తులకు తెలిపారు. రామాలయంలో కూడా దీపాలు వెలిగించి దుర్గామాత, దత్తాత్రేయ, అయ్యప్ప, ఎల్లమ్మ తల్లి ఏకశిలా స్తంభం వద్ద గల హనుమాన్ దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ నందీశ్వర్ మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. అన్నదాతలుగా సాయిబాబా గౌడ్ ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మారంపల్లి కి చెందిన బారే వెంకటరమణ, గాదేపల్లి శ్రీధర్, నిజామాబాద్ కు చెందిన బంటు వీరేందర్ అన్నదాతలుగా వ్యవహరించగా గుట్టపైకి విచ్చేసిన వేలాది మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో బి సుమన్, పిసి గంగారెడ్డి, కొడిగేల మల్లయ్య, చరణ్ రెడ్డి, జిమ్మీ రవి, బట్టు శంకర్, సిద్దులగుట్ట సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment